బాన్సువాడ లో జోరుగా అక్రమ రిజిస్ట్రేషన్లు..


 బాన్సువాడ లో జోరుగా అక్రమ రిజిస్ట్రేషన్లు

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి... 
లేఔట్ ల అనుమతులు లేకుండానే ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు.... 

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ రాష్ట్ర ప్రతినిధి..... జులై 22 (బుధవారం)...  బాన్సువాడ డివిజన్ కేంద్రంలో జోరుగా అక్రమ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే బాన్సువాడ డివిజన్ పరిధిలోని జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండల కేంద్రానికి చెందిన ఓ  రైతు పేరు మీద ఉన్నటువంటి ఒక ఎకరం ఏడుగుంటల విస్తీర్ణం భూమిని భూభారతి పోర్టల్ లో సదరు రైతు నాలా కన్వర్షన్ చేయించారు. ఇంతవరకు బాగానే ఉంది అసలు తతంగం ఇక్కడే ప్రారంభమైంది .

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరం  7 గుంటల విస్తీర్ణం భూమిని ప్లాట్లు చేసి విక్రయించాలంటే డిస్టిక్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుమతులతో రిజిస్ట్రేషన్లు చేసి వాటిలో 10% భూమిని ప్రభుత్వ అవసరాల కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత ప్లాట్లను విక్రయించాల్సి ఉంది .కానీ ఇక్కడ నిబంధనలకు పాతర వేసి అధికారులు బారి స్థాయిలో ముడుపులు అందుకొని  మే నెలలో ఎకరం 7 గుంటల భూమిని 180,280,125,335,285,241,240,100,280, 335,357280,357,335,280 గజాల చొప్పున మొత్తం 16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసారు. 

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.... నిబంధనల ప్రకారం లేఅవుట్ అనుమతులు వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది ఎలాంటి అనుమతులు లేకుండానే ఎకరం ఏడుగుంటల విస్తీర్ణం భూమిని 16 ప్లాట్లుగా రిజిస్ట్రేషన్  శాఖ అధికారులు  రిజిస్టర్ చేశారు. వారు ఏ విధంగా ఈ రిజిస్ట్రేషన్లు నిర్వహించారు అనేది ప్రశ్నార్థకం ఒకవైపు ప్రభుత్వం అధికారుల అవినీతిని అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన నిబంధనలను ఏర్పరచడంతోపాటు .అభివృద్ధి చెందుతున్న కాలంతోపాటు కంప్యూటర్ సాఫ్ట్వేర్లను సైతం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు మాత్రం ఆగడం లేదు.

ఒక్కో డాక్యుమెంట్ కి భారీగా డబ్బుల వసూలు.?

ఈ 16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు సంబంధిత శాఖ అధికారి భారీ  మొత్తం లో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి.

ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారని రిజిస్ట్రేషన్ చేశాం ... బాన్సువాడ సబ్ రిజిస్టర్ శివప్రసాద్... గత రెండు నెలల క్రితం జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై  తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ రాష్ట్ర ప్రతినిధి బాన్సువాడ సబ్ రిజిస్టర్ శివప్రసాద్ వివరణ కోరగా సదరు రైతు నాలా కన్వర్షన్ చేయించుకుని ఎల్ఆర్ఎస్ కట్టుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్లు నిర్వహించాము. నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని ఆయన సమాధానం ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post

Janani Web Solutions

Janani Web Solutions
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview