తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ రాష్ట్ర ప్రతినిధి..... జులై 22 (బుధవారం). కేర్ ఆస్పత్రిలో బుధవారం చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ ప్రవీణ్ ను పరామర్శించిన ప్రభుత్వ విప్ బల్మురి వెంకట్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజధాని నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన లెజెండ్ టీవీ జర్నలిస్ట్ ప్రవీణ్ పై ఆర్ఎస్ఎస్ ,భాజపా కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. సాక్షాత్తు పోలీసుల ఎదుట భాజపా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మీడియా మిత్రులపై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. దీంతోపాటు దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉండడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Tags
Telangana
