రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మధ్యవర్తుల ప్రమేయాలు....
అధికారులను మేనేజ్చే చేస్తున్న డాక్యుమెంట్ రైటర్...
నీకెందుకు సార్ అంతా నేను చూసుకుంటా ఓ రైటర్..
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ రాష్ట్ర ప్రతినిధి జూలై 24 (శుక్రవారం): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మధ్యవర్తుల ప్రమేయాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వివరాలు కి వెళ్తే గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు డబ్బులు లంచం తీసుకుని పట్టుబడడంతో ఆయనను సస్పెన్షన్ చేశారు. అప్పటినుండి రెగ్యులర్ సబ్ రిజిస్టర్ ఇక్కడ ఉన్నతాధికారులు నియమించలేదు. కేవలం గత మూడు ఏళ్లుగా ఇన్చార్జి సబ్ రిజిస్టర్ తో ఇక్కడ కాలం వెళ్లదీస్తున్నారు.
అధికారుల విధి నిర్వహణలో డాక్యుమెంట్ రైటర్ ప్రమేయం...
ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఎవరు సబ్ రిజిస్టర్లు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఓ డాక్యుమెంట్ రైటర్ సంబంధిత శాఖలో ఉన్నటువంటి ఓ అధికారిని ఇక్కడ అన్ని తానే చూసుకుంటానని తనకు బాగా డబ్బున్న వ్యక్తులతో పాటు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని అధికారులను నమ్మబలికి ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఉన్నతాధికారులను మేనేజ్ చేసి ఇన్చార్జిలపై ఇక్కడ విధి నిర్వహణ కు తీసుకొస్తున్నారు..
తాను చెప్పిందే వేదం అన్నట్టుగా డాక్యుమెంట్ రైటర్ తీరు..
సదర్ డాక్యుమెంట్ రైటర్ ఇన్చార్జిగా అధికారిని ఉన్నతాధికారుల తో మాట్లాడి రప్పించినందుకుగాను తనకున్న పలుకుబడి అడ్డం పెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా సదరు అధికారులతో రిజిస్ట్రేషన్ లో సైతం చేపిస్తున్నట్లు తెలుస్తోంది. తనని కాదని వేరే డాక్యుమెంట్ రైటర్ల డాక్యుమెంట్ సైతం రిజిస్ట్రేషన్లు జరిగినట్లయితే కార్యాలయంలో నానా హడావుడి చేసి తోటి రైటర్లను సైతం బెదిరిస్తున్నట్లు సమాచారం . ఏది ఏమైనప్పటికీ బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత ఏడాదికాలంగ జరిగిన రిజిస్ట్రేషన్ లపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు.
